
పల్లెటూరు కన్నతల్లి ఒడిలాంటిది. మనకు హాయినిస్తుంది. పల్లెటూరి వాతావరణం అమోఘమైనది, ఎటు చూసినా ఆప్యాయంగా పలకరించేవారే!
ఇక్కడ ఒకరితో ఒకరికి విడదీయలేని సంబంధం ఏర్పడుతుంది. ఒకరి కష్టసుఖాలను మరొకరు పంచుకుంటారు. ఎటువంటి కష్టాన్నైనా కలిసి ఎదుర్కొంటారు. సాయంత్రం అవగానే అందరూ ఓకచోట కలిసి జరిగిన విషయాలను తలచుకుంటూ, ఓతరులతో పంచుకుంటూ, నవ్వుకుంటూ ఆనందంగా గడుపుతారు. పల్లెటూర్లలో కాలుష్యం ఉండదు. ఎటు చూసినా చెట్లు, పొలాలు, చల్లని గాలి సేదతీరుస్తుంది.
పల్లెటూరి వాతావరణం మనసుకి ఉల్లాసాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. ఇక్కడ ఊరంతా పచ్చదనంతో వెదజల్లుతూ కళకళలాడుతూంటుంది.
More Stories
Mainpuri (मैनपुरी)
ग्यारसपुर गाँव
पटना गाँव की संस्कृति