మీ స్వరం సుస్వరం

మీ స్వరం సుస్వరం, సగర్వ భారత్ ఫౌండేషన్ సమర్పంచు ఇండియన్ టాలెంట్స్ లైబ్రరీ యొక్క తెలుగు వారి కళా వేదిక. సంగీత సాహిత్య ప్రపంచంలో ఏందరో మహానుభావులు.. వారందరికి వందనాలను సమర్పించుకుంటూ, 2021 జూన్ లో ప్రముఖ పాటల కార్యక్రమంలో తమ ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన గాయనీ గాయకులను న్యాయ నిర్ణేతలుగా నియమించి, 12సం|| వయస్సు గల గాయనీ గాయకులతో ఆన్లైన్ వేదికగా సీజన్-01 ని ప్రారంభించింది.

సీజన్-01 న్యాయ నిర్ణేతలు:
- సుగంధిని ఏల్చూరి
- వంశీధర్ T.K.V.M
- ప్రియ పిడపర్తి
- డా: కమల యశస్విని
- రెడ్డెప్పాచారి
- బొడ్డు వీరస్వామి
చక్రి ఏల్చూరి గారు కార్యక్రమానికి ప్రారంభ గీతాన్ని స్వరపరచగా, సుగంధిని ఏల్చూరి గారు పాడారు.
“చిరు గళములనే సవరించి
మధు పదములనే పలికించి
స.రి.గ.మ.ప.ద.ని
స్వరములు పలికెడి..
“చిరు గళములనే సవరించి
మధు పదములనే పలికించి
స.రి.గ.మ.ప.ద.ని
స్వరములు పలికెడి..
మీ స్వరం సుస్వరం…
మీ స్వరం సుస్వరం…
మీ స్వరం సుస్వరం…”
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అమెరికా నుండి 100కి పైగా గాయనీ గాయకులు సీజన్-01 లో పాల్గొని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన 24మందితో సీజన్-01 మొదలైంది.
ఈ కార్యక్రమం ప్రతిరోజూ సాయంత్రం 6:30..లకు క్రింది యూట్యుబ్ వేదికగా ప్రత్యక్షప్రసారం అయినది.
మరిన్ని వివరాలకు యూట్యుబ్ ని వీక్షిచండి.
15 ఎపిసోడ్ లను నిరంతరాయంగా కొనసాగించి, నవంబర్ 21న ఫైనల్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా లిటిల్ మ్యూజీసియన్స్ అకాడమి వ్యవస్థాపకులు కోమండూరి రామాచారి గారు, డ్యాన్స్++ నృత్య కళాకారులు జగబత్తుల మహేశ్వరి గారు & తేజస్విని గారు విచ్చేసి విజేతలను ప్రకటించారు.
సీజన్-01 లో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి – విజేత స్థానాన్ని సాకేత్ కొమ్మాజొస్యుల దక్కించుకోగా..
ప్రియాంకా ప్రభాకరన్, సంగరాజు విజయ చరిష్మ, కైవల్య కప్పగంతుల.. వరుసగా 2,3,4 వ స్థానాలలో నిలిచారు.


ప్రస్తుతం సీజన్-02 కి ఆడిషన్స్ ను స్వీకరించండం జరిగింది. డిసెంబర్ 12వ తేదీన ఆన్లైన్ వేదిక(యూట్యూబ్) ద్వారా ఈ సీజన్ కి ఎవరు ఎంపికయ్యరనే విషయం తెలియజేస్తారు.
జనవరి 2022లో ఎంపికయిన 24మంది గాయనీ గాయకులతో సీజన్-02 మొదలవ్వనుంది.
మరిన్ని వివరాలకు, అలాగే ఈ కార్యక్రమానికి మీ వంతు సహాయం చేసి కళాకారులను ప్రొత్సహించేందుకు +91 9148695365 ని సంప్రదించండి లేదా indiantalentslibrary@gmail.com కి మెయిల్ చేయండి.