March 30, 2023

శ్రావణమాసం లో పండుగలు, పర్వ దినాలు

ఈ శ్రావణ మాసంలో ఇళ్ళన్నీ సోభాయమానంగా అలంకరించబడి కొత్తకళతో నిండి ఉంటాయి. గడపలకు పసుపు కుంకుమలు, ఇంటికి పచ్చని తోరణాలు, పూల మాలలు, కట్టి ఎంతో అందంగా కళకళలాడుతుంటాయి.

శ్రావణ మాసంలో పౌర్ణమినాడు చంద్రడు శ్రవణా నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసాన్ని శ్రావణ మాసం అని పిలుస్తారు. ఇక్కడి నుంచే వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. అన్ని పండుగలలోకి ఎన్నో విశేషాలను, పండుగలను తనలో నింపుకున్న ఈ మాసం అంటే ముఖ్యంగా ముత్తైదువులుకు పండుగగా ఉంటుంది. పేరంటాలు, పండుగలు, పూజలు, పూలు, ఫలాలు దానాలు, ధర్మాలు ఇలా ప్రతి రోజునూ దైవారాధనలో గడుపుతారు. ఈ మాసంలో ముఖ్యంగా జరుపుకునే పండగలను, ఆరధనలను తెలుసుకుందాం.
మన పండుగలలో మొదటిగా వచ్చే తొలి ఏకాదశి తరువాత అంత వైభవంగా వచ్చే పండుగ వరలక్ష్మీ వ్రతం.. ఈ వ్రతాన్ని నవ వధవులు, అలాగే ముత్తైదువులు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగకు ఉన్న ప్రత్యేకతలలో ముందుగా చెప్పుకోవలసింది… అలంకరణ.. ఈ శ్రావణ మాసంలో ఇళ్ళన్నీ సోభాయమానంగా అలంకరించబడి కొత్తకళతో నిండి ఉంటాయి. గడపలకు పసుపు కుంకుమలు, ఇంటికి పచ్చని తోరణాలు, పూల మాలలు, కట్టి ఎంతో అందంగా కళకళలాడుతుంటాయి. అంతేనా ఉదయం సాయంత్రం దీపారాధన, ఓ గుడిలో ఉంటున్న అనుభూతిని తెచ్చి పెడతాయి. సాంబ్రాణి ధూపాలతో మంగళకరంగా ఆ దేవికి స్వాగతం పలుకుతున్నట్టు దేవాలయాలు, ఇళ్ళు దర్శనమిస్తాయి. ఈ మాసంలో చేసే వ్రతాలు, పుజలు సౌభాగ్యాన్ని పెంచుతాయని నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపతికి తెలిపినట్టు ప్రతితి. ఈ మాసంలోనే వచ్చే వరలక్ష్మీ దేవివ్రతాన్ని నవ వధువులు, వివాహం అయిన వారు జరుపుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా సోమ, మంగళ, శుక్ర, శనివారాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్న రోజులు.. ఆ ఈ మాసంలో జరుపుకునే మంగళ గౌరీ వ్రతం, శ్రావణ శుక్రవారాలు సుఖ సంతోషాలను ప్రసాదించడమే కాకుండా అష్టైశ్వర్వాలను నిండు ముత్తైదువులుగా మెలిగే భాగ్యాన్ని ఆ దేవి ప్రసాదిస్తుందని నమ్ముతారు ఆడవారు. ఈ మాసం మొత్తం జరుపునే ఆరాధనలు, పూజలు, ఈ మాసానికే కొత్తదనాన్ని తెచ్చి పెడతాయి. ఇక శ్రావణ మాసంలోనే వచ్చే మరో పండుగ మన రాష్ఠ్రాలలో జరుపుకునే నాగుల చవితి.. ఈ పండుగను, ఉపవాసం ఉండి పుట్టలో పాలు పోసి చాలా శ్రద్ధగా నాగదేవతను ఆరాధిస్తారు. ఇలా విషసర్పాలను నాగదేవతగా ఆరాధించడం అనే సాంప్రదాయం ఒక్క మన దేశంలోనే ఉన్నది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా నాగదేవతను ఆరాధిస్తారు. అంతేనా ముడుపులను కూడా దేవతకు చెల్లిస్తారు. పుట్టలో పాలు, కోడిగుడ్డును .. తేగలు, నువ్వుల చిమిలిని ప్రాసాదాలను సమర్పిస్తారు. కొందరు పుట్ట దగ్గరే బాణాసంచాను కాల్చి అక్కడే ప్రసాదాలను తయారుచేసుకుని దేవతకు సమర్పించి., వారూ భుజిస్తారు.
అంతే కాకుండా ఈ శ్రావణ మాసానికే ప్రత్యేకతను తెచ్చిపెట్టే పండుగలు, పర్వదినాలు ఇదే మాసంలో ఉన్నాయి. శక్ద్వదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించిన వారికి మోక్షం లభిస్తుందని అంటారు. శుక్ల పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజున సోదరుల సుఖాన్ని కోరుతూ చెల్లాయిలు కట్టే రక్షాబంధం జరుపుకుంటారు. అంతే కాకుండా ఇదే రోజున యజ్ఞోపవిత ధారణ, వేదభ్యాసాన్ని ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ గాయత్రీ దేవి అనుగ్రహం మనకు ఉంటుందని నమ్ముతారు.
ఇదే మాసంలో కృష్ణ పాడ్యమి, హయగ్రీవ జయంతి , కృష్ణ పక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన నాగుల చవితి, వంటి ముఖ్య రోజులు కూడా ఉన్నాయి. ఇదే శ్రావణ మాసంలో కృష్ణాష్ణమి, పోలాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం కూడా శ్రావణ మాసం ప్రత్యేకత.

%d bloggers like this: