కనెక్టెడ్ ఇండియన్ జూన్ 2020 నెలకిగానూ దోరడ్ల వెంకట సాయి గాయత్రిని ఉత్తమ ప్రతిభా కళాకారిణిగా పరిచయం చేస్తోంది. గాయత్రి గురించి తెలుసుకొని, తనతో మాట్లాడుతూ నీ ఆశయం ఏమిటని అడిగితే “లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్” లో స్థానం సంపాదించుకోవాలని ఎంతో ధీమాతో తెలియజేసింది.

ఇక తన కళా నైపుణ్యం గురించి చెప్పాలంటే, శిలలపై శిల్పాలు చెక్కినారు అనేది మన పూర్వీకుల మాట – ఇప్పుడు గాయత్రి ఆధునాతనంగా, సూక్ష్మమైన బియ్యపు గింజ, నువ్వులు, సేమియాలు, పిన్నుసూది పై రాయడం, బొమ్మలు వేయడం చేస్తున్నారు. అందరిలాగా కాదు సుమా, ఎలాంటి మైక్రోస్కోపులాంటి పరికరాలు లేకుండా రాయడం గాయత్రి కళా విశిష్టత.
గాయత్రి 100 అక్షరాలను ఒక చిన్న బియ్యపుగింజపై మూడు నిముషాలలో అలవోకగా రాసేయగల దిట్ట, ఇంకా చెప్పాలంటే వినాయకుని పెయింటింగు సూక్ష్మమైన నువ్వులపై వేయగలదు.

గాయత్రి ఇప్పటికే ప్రఖ్యాత రికార్డులను దక్కించుకున్నారు – అవి , ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ , బ్రేవో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ , క్రెడెన్సి బుక్ ఆఫ్ రికార్డ్స్ .
వీటన్నింటి వెనుక వున్న కఠిన సాధన గురించి తెలుసుకోవాలని మాకు మరింత ఆసక్తి కలిగింది.
అందుకు గాయత్రి సమాధానం: -నేను బడికి వేళ్ళేటప్పుడు activity క్లాసులో బలపం, చాక్ పీస్ పై ఒకో అక్షరం రాయడం చేస్తుండేదానిని. తరువాత చాలా రోజులు దూరంగా వున్నాను. మళ్లీ, 2010 లో విహార యాత్రకు వెళ్ళిన చోట కీ చైన్సు షాపులో సూక్ష్మమైన వస్తువులపై పేరు రాయడం చూసి మళ్లీ తన కళను గుర్తుచేసుకొన్నారు. ఈసారి వెనకడుగు వేయకూడదు అనుకుంది. మొదట్లో చాలా శ్రమపడ్డాను, ఎవరి శిక్షణా లేకుండా, ఎలాంటి పరికరాలు వాడకుండా కొనసాగించాను. తల్లిదండ్రులు, స్నేహితుల ఆశీస్సులు నాకు అండాగా నిలిచాయి.
గాయత్రిని ఐకాన్ ఆర్టిస్టు ఆఫ్ ది మంత్ గా పరిచయం చేయడం మాకు ఎంతో గర్వకారణం.
చివరిగా అందరి కళాకారులకి మా మాటగా:
మీ కళలను సాధించే సమరంలో ఎక్కడా వెనకడుగు వేయకండి. మీకూ చరిత్రలో ఒకరోజు.. ఎంతో దూరంలో లేదు.
శ్రీశాంతి దుగ్గిరాల
YouTube Video link : https://youtu.be/8c6A0qrlcQc
More Stories
బామ్మ కథ “బంగారు మురుగు”
చంద్రగిరి శిఖరం
రేడియో హీరోయిన్ శారదా శ్రీనివాసన్….