September 29, 2023
వ్యర్థాలతో మిద్దె తోటల పెంపకం

వ్యర్థాలతో ఇంటితోట పెంపకం..

స్థలం కలిసి రావాలంటే ఒకే పొడవాటి తాడుకు కట్టి ఒకదాని వెంట ఒకటి ఒకే వరుసలో పైనుంచి కింద వరకూ వేలాడదీయవచ్చు. ఇలా చేస్తే తక్కువ స్థలంలోనే ఎక్కువ పంటలు పెంచవచ్చు.

పనికిరాని వస్తువులను ఉపయోగించి ఇంటిపంటలు సాగు చేస్తున్నారు సిటీవాసులు..ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడిస్తే ఇంటిపంటల పెంపకానికి కావేవీ అనర్హం అంటున్నారు.


హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మొక్కల పెంపకం హాబీ గా పెట్టుకున్నవారంతా తమ ఇంట్లోనే పెరటి తోటను పెంచుతున్నారు. ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ ఆసక్తితోనే పాత వస్తువులను వృథాగా పారేయకుండా సృజనాత్మకంగా ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. పాత డబ్బాలు, మగ్గులు, టీ జార్‌లు, కూల్ డ్రింకు బాటిళ్లు , టైర్లు, టిన్నులు, షూలు, కుండలు, తినుబండారాల పార్శిల్ పాత్రలు, పైపులు, బూట్లు, సాక్స్‌లు, పాత టీవీల క్యాబినెట్లు, ట్రాన్సిస్టర్ క్యాబినెట్లు, నీళ్ల డ్రమ్ములు, సీడీల పార్శిల్ డబ్బాలు, విద్యుత్ బల్బులు.. ఇలా సుమారు రెండు వందల వరకూ పనికిరాని వస్తువుల్లో ఇంటిపంటలను పండిస్తున్నారు.

పాత డబ్బాలకు రంగులేసి, బొమ్మలు వేసి ఇంటిపంటలకు సిద్ధం చేస్తారు. సంప్రదాయ, ఆధునిక, మధుబని, ట్రైబల్ పెయింటింగ్స్‌ను మొక్కల కుండీలపై చిత్రిస్తున్నారు. ఇవి చూడముచ్చటగా ఉండటమే కాకుండా ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండించడాన్ని కుటుంబ సభ్యులతోపాటు అతిథులూ అభినందిస్తున్నారని, పరిసరాలను మరింత అందంగా మార్చుకోవటం ద్వారా మనోల్లాసం కలుగుతున్నదని వారు అంటున్నారు.
‘పెద్ద బకెట్లు, పాత్రలు వంటి వాటిలో కరివేపాకు, మిరప, వంగ, టమాటా వంటి మొక్కలు పెట్టాలి. సన్నగా, పొడవుగా ఉండే పైపుల్లో కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలు పెంచాలి. మొక్కల ఆకులు, ఇంట్లో కూరగాయ వ్యర్థాలతో తయారైన కంపోస్టు, పశువుల ఎరువు, టీ పౌడర్ వంటి వాటిని కలిపిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు.

ఇంట్లో వాతావరణానికి తగినట్టు దొరికిన వస్తువులతోనూ, పనికి రాని వస్తువులతోనూ మొక్కలు పెంచాలనుకోవడం కొత్త ఆలోచన..
రోజువారీ పనులకు అడ్డం రాకుండా గదుల్లో, హాలులో, కిటికీల బయట, మెట్ల దగ్గర, ప్రహరీ గోడలకు వేలాడ దీసేలా పాత వస్తువులతో కుండీలను రూపొందించడం మరో ప్రత్యేకత. స్థలం కలిసి రావాలంటే ఒకే పొడవాటి తాడుకు కట్టి ఒకదాని వెంట ఒకటి ఒకే వరుసలో పైనుంచి కింద వరకూ వేలాడదీయవచ్చు. ఇలా చేస్తే తక్కువ స్థలంలోనే ఎక్కువ పంటలు పెంచవచ్చు. కుటుంబానికి అవసరమయ్యే కూరగాయలు, ఆకుకూరల్లో సగం వరకు తాను ఇలాగే పెంచుతున్నారు. మామూలు రోజుల్లో‘శని, ఆదివారాలు పూర్తిగా ఇంటిపంటలకే కేటాయిస్తున్నారు వారు.. ఆఫీసులు కాలేజీలు స్కూళ్ళు లేని ఈ కాళీ సమయాన్ని ఇలా ఉయోగిస్తున్నామని కొందరు చెప్పుకువచ్చారు. అపార్ట్‌మెంట్లు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు, స్కూళ్లలో ఈ పద్ధతుల్లో మొక్కల పెంపకంపై శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ పంటలను చూసినప్పుడల్లా మిగతావారు వారి పెరట్లో ఇలా పెంచుకోవాలని అనుకోవడం.. ఈ పద్దతిని ఆదర్శంగా తీసుకోవడం మరో మంచి పరిణామం.

%d bloggers like this: