ఏ దేశ భవిష్యత్త్ అయినా అందులోని విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుంది. ఒక దేశం పేరు దాని కీర్తి విద్యావంతులైన యువతచే దిద్దబడి ఉంటుంది. మనిషి మనుగడకు, చరిత్ర ఉత్తేజమవడానికి సమాజాభివృద్ధికి యువతరం చాలా అవసరం.
మన సమాజం నిరంతరం ప్రవహించేనదిలాంటిది. నదిలోనికి వచ్చిన కొత్తనీరు పొలాల్లోకి ప్రవహించి సస్యశ్యామలం చేస్తుంది..అదేలా మన సమాజం పాతకొత్తల మేలు కలయిక. మన శరీరంలోకి కొత్త రక్తం ఎక్కినప్పుడు అది మనకు ఎంతటి పుష్టినిస్తుందో అదేవిధంగా ప్రతి యుగంలో జరిగే మార్పులకు యువత నవ్యత్వానికీ భవ్యత్వానికి తోడ్పడుతూ ఉంటుంది.
యువ శక్తి మన భారతదేశ భవిష్యత్తుకు వెన్నుముకగా నిలవాలి. అన్యాయాన్ని, అజ్ఞానాన్ని, అవి నీతిని రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని తీవ్రవాదాన్ని తిప్పగొట్టగల సమర్థ సత్తావుండేది నేటి యువతలోనే.. భారతదేశానికున్న గొప్ప సంపద యువత మాత్రమే. వారిలో చరిత్ర సృష్టించగల సత్తా ఉంది.
మరో మాటలో చెప్పాలంటే, విద్యార్థులు ఏ దేశానికైనా నిజమైన నిధి. విద్యార్థుల శక్తిని నిర్మాణాత్మక ప్రయోజనాల కోసం నిర్దేశిస్తే, దేశం మొత్తం గొప్ప అభివృద్ధిని రుచి చూస్తుంది.
ఆవేశాన్ని అరికట్టి ఆలోచనను పెంపొందించుకొని సరైన మార్గంలో యువతరం నడిస్తే మనదేశం ఎప్పుడూ స్వర్గసదృశమే.
ఇంతటి శక్తిని తమలో నింపుకున్న విద్యార్థలు రాజకీయరంగంలో కూడా యువశక్తితో చక్కని పాత్రవహించవచ్చు. కానీ నేటి యువతరం విద్యావంతులై నిరాశ, నిస్పృహాలతో విసిగి చివరకు సరైన నాయకుడిని కూడా ఎన్నుకొనలేని సందిగ్ధ్దావస్థలో పడిపోతున్నారు.
అయితే కొత్త తరానికి సరైన మార్గదర్శకత్వం కావాలి. దీనికి ప్రభుత్వాలు స్వయంగా నడుంకట్టి యువతను సమాజాభివృద్ధికి, దేశాభివృద్ధికి వనరులుగా వినియోగించుకోవాలి. దీనితో వారి వ్యవహారిక శైలిలోనూ, భవిష్యత్తు వ్యవహారాలోచనలోనూ మార్పు తప్పక వస్తుంది.
నానాటికి తరిగిపోతున్న ఉపాధి అవకాశాలు యువతను తీవ్రఆందోళనకు గురిచేస్తున్నాయి. యువతను అన్ని విధాలా ప్రోత్సహించాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రభుత్వాలు తరచూ క్రీడాపోటీలను నిర్వహించడంవల్ల యువతలో ఉత్సాహం, ఆత్వవిశ్వాసం పెరుగుతాయి.
యువశక్తి నూతన సామాజిక నిర్మాణానికి మూలం కావాలి. నైతికవిలువల్ని సంఘదృష్టిని, సమిష్టికృషిని, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధిపరచుకుంటూ తమ ప్రతిభాపాటవాలను దేశం కోసం వినియోగించాలి.
స్వేచ్ఛాభావం.. విలువలతో కూడిన పాలనా విధానం వల్లనే యువత భవిష్యత్తును నిర్మించుకోగలుగుతుంది. నైతికవిలువలపై పురాతన సంస్కృతిపై గౌరవాన్ని పెంపొందించుకొని మనదేశ గౌరవ ప్రతిష్టలను పెంచాలి. నిలబెట్టాలి.
యువత తనచుట్టూ జరుగుతున్న పరిణామాలను ఎప్ప టికప్పుడు గమనిస్తూ సమాజశ్రేయస్సుకు తమవంతుకర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
More Stories
బామ్మ కథ “బంగారు మురుగు”
भूमिका By Deepak Agarwal
చంద్రగిరి శిఖరం