కరోనాతో కటకట – బింధుశ్రీ గౌడ్
By Bindu Sri Goud
“మరుగున పడిన మానవత్వానికి ఊపిరి పోసావు,
పీల్చే గాలిని సైతం కబళించేసావు.
ప్రవహించే నదికి ప్రశాంతత నేర్పావు,
అలలా ఎగసిపడే మానవునికి సైతం అడ్డుగోడ వేశావు.
అడవిబిడ్డలను ఆదుకున్నావు..
కరుణ లేదా మానవ జీవితం పైన,
మాతృప్రేమ పైన..
పుస్తెలు అమ్మినా పూట గడవని బీద మానవుని పైన…
కరణించవా కరోనా..
కనుమరగవ్వవా కరోనా…”
★ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా ఎంతో ఆందోళనకర రీతిలో విజృభిస్తోంది.
★అయిన గాని మరుగున పడిన మానవత్వానికి ఊపిరి పోస్తూ, మనుషులలో మంచితనం నెలకోల్పుతూ, పేద, రాజు అనే బేధం లేకుండా అందరికి భయం ఒక్కటే అని నిరూపించింది!!
★మనం పీలిచే గాలిలో సైతం కరోనా ఉన్నా, అదే గాలిని కలుషితం కాకుండా ఆపగలిగింది…
★ఎల్లా వేళలా తిరుగుతూ, పరిగెడుతూ ఉండే మానవుల కాళ్ళకు కంచే వేసి, బ్రతుకు విలువ తెలిసేలా చేసింది!!
★సోకింది అనుకో అంటులేదు, ఇంటిలో కాదు కదా, కనీసం ఊరిలో కూడా చోటు లేదు అనేలా మానవులకు భయాన్ని పెంచింది…
★అడవిలో జీవించే మూగజీవులకు కాలుష్య రహిత ప్రకృతిని పొందేలా కరోనా తోడ్పడింది.
★మనుషులు మాత్రం ఉపాధి కోల్పోయి, పుస్తెలు అమ్మిన సరిపోని జీవనాన్ని గడిపేలా చేసింది ఈ కరోనా!!
★వ్యక్తిగత శుభ్రత ఆవశ్యకతను, ప్రకృతి భద్రతను, జంతు ప్రేమను పెంపొందించేలా ఈ కరోనా ఉపయోగపడింది!!
🙂
More Stories
బామ్మ కథ “బంగారు మురుగు”
చంద్రగిరి శిఖరం
రేడియో హీరోయిన్ శారదా శ్రీనివాసన్….